కమర్షియల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న “ది రాజా సాబ్” సినిమా రొమాంటిక్ హర్రర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాలో ప్రభాస్ చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇటీవల కాలంలో ఈ తరహా పాత్రలలో ఆయన నటించకపోవడంతో, ఈ సినిమా పై ఫ్యాన్స్ లో ఆసక్తి మరింత పెరిగింది… ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయినప్పటికీ, ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.. మొదట ఈ సినిమా 2025 ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి డిసెంబర్ 5, 2025 గా విడుదల తేదీని ప్రచారం చేస్తున్నాయి. కానీ, ఈ తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు..
ఇక, “ది రాజా సాబ్” సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది… త్వరలోనే ఈ సినిమా టీజర్ విడుదల కానున్నట్లు సమాచారం..”రాజా సాబ్” టీజర్ కు సంబంధించిన డబ్బింగ్ ప్రభాస్ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం.. టీజర్‌కు డబ్బింగ్ పూర్తి చేశారని, ప్రస్తుతం టీజర్ కూడా కట్ చేయబడిందని వినిపిస్తున్నాయి.. అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్,రిధి కుమార్ ప్రధాన హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు, మరియు ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి…









