సన్నీ డియోల్ ‘గద్దర్ 2’ తో హిట్ ట్రాక్ ఎక్కాడు.. అదే హిట్ ట్రాక్ ను మరోసారి జాట్ సినిమాతో కొనసాగిస్తున్నాడు.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన జాట్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.. మాస్ యాక్షన్ మూవీ ఎంటర్‌టైనర్ గా జాట్ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా థియేటర్ లలో రన్ అవుతుంది..
కథను బాలీవుడ్ ప్రేక్షకులకు ప్యాక్ చేసి చూపించడంలో గోపిచంద్ మలినేని క్లీన్ హిట్ కొట్టాడు. స్టైల్, మాస్ డైలాగ్స్, పవర్‌పుల్ యాక్షన్ సీన్స్. అయినా కాస్త ‘పాత ఫార్ములా’ ఫీలింగ్ కలిగించిందన్న విమర్శలు రావడం సహజమే. కానీ అలా అని కలెక్షన్స్ మీద ఎలాంటి ప్రభావం పడలేదు. మాస్ ఆడియెన్స్ ఎక్కడైనా ఉండవచ్చు – వారికి సన్నీ డియోల్ లాంటి హీరోల యాక్షన్ అంటే పిచ్చి.
ఇప్పుడు జాట్ 2’అనౌన్స్ చేసిన మేకర్స్ డిసిషన్ చూస్తే, మొదటి భాగం ఎంత వరకు కమర్షియల్‌గా వర్కౌట్ అయిందో తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ & పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వంటి టాప్ ప్రొడక్షన్ హౌసెస్ తిరిగి చేతులు కలపడం అంటే, ప్రాజెక్ట్ పైన వాళ్లకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చెప్పకనే చెప్తుంది.
ఇంకా జాట్ 2 లో సన్నీ డియోల్ మళ్లీ అదే మాస్ ఆవతారంలో కనిపిస్తారా? లేక ఎమోషనల్ డెప్త్ పెంచి సీక్వెల్‌కి బలాన్ని పెంచుతారా అన్నది ఆసక్తికరం. గోపీచంద్ మలినేని సీక్వెల్ డైరెక్షన్‌లో ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి.