Search
Close this search box.

  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్..? వర్కౌట్ అవుతుందా..?

అమీర్ ఖాన్‌ ‘లాల్ సింగ్ చద్దా’ తో భారీ డిజాస్టర్

అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాను ప్రకటించలేదు..అయితే ఇప్పుడు అమీర్ ఖాన్ సౌత్ డైరెక్టర్ లతో సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.. అందుకనే వరుసగా బాలీవుడ్ డైరెక్టర్ లను రిజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.. సౌత్ సినిమాలు సౌత్ తో పాటు అన్నీ భాషల్లో సత్తా చాటడంతో సౌత్ సినిమాపై ఇంటరెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం…లోకేష్ కనగరాజ్ తో అమీర్ ఖాన్ ఓ సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే, అది ఇండియన్ సినిమాకే పెద్ద క్యాన్వాస్ అవుతుంది.. ఐతే ప్రస్తుతం అమీర్ ఖాన్ రజినీ కాంత్ హీరోగా లోకేష్ దర్శకత్వంలో వస్తున్న కూలీ సినిమాలో ఓ కామెయో రోల్ చేస్తున్నట్లు సమాచారం.. లోకేష్ ఖైదీ 2,విక్రమ్ 2 పూర్తి చేసిన తర్వాత అమీర్,లోకేష్ ప్రాజెక్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది..ఐతే ఈ గ్యాప్ లో మరో సౌత్ డైరెక్టర్ తో ఓ సినిమాను అమీర్ ఖాన్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్. అవుతుంది..

వంశీ పైడిపల్లి – అమీర్ ఖాన్ కాంబో..

ఐతే సోషల్ మీడియాలో అమీర్ ఖాన్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు న్యూస్ వస్తుంది.. వంశీ పైడిపల్లి చెప్పిన స్టోరీకి అమీర్ ఖాన్ ఫిదా అయ్యారట.. వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట..వంశీపైడిపల్లి కథలలో ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, కమర్షియల్ టచ్ మిక్స్ బాగా ఉంటుంది. ‘మహర్షి’ ఊపిరి’ వంటి సినిమాలు అమీర్ ఖాన్‌కి కూడా ఇంప్రెస్ చేసేలా ఉంటాయి. అయితే ఈ సినిమాను మైత్రి మూవీస్ & దిల్ రాజు కలసి నిర్మిస్తున్నట్లు సమాచారం.. ఈ కాంబో నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు