Search
Close this search box.

  Nc 24: నాగచైతన్యకు జోడీగా లక్కీ హీరోయిన్..?

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు.. ‘తండేల్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో రూ.100 కోట్ల క్లబ్‌లో చైతన్య అడుగుపెట్టాడు..రియల్ లైఫ్ లో కూడా శోబితను పెళ్లి చేసుకుని ఫుల్ జోష్ గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.. చైతన్య,సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండెల్ భారీ హిట్ కావడంతో చైతన్య నెక్స్ట్ చేయబోయే సినిమా పై భారీ హైప్ ఉంది.. ఈసారి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండూ దర్శకత్వంలో ఓ మైథాలాజికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడు.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో తెరక్కుతున్నట్లు సమాచారం..ఐతే ఈ సినిమా నుండి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు సమాచారం.. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచరం.. ఇక

మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఎంటరైందంటే సినిమాకి మరింత క్రేజ్ వచ్చేస్తుంది. గతంలో ఆమె ‘లక్కీ భాస్కర్’తో సూపర్ హిట్ కొట్టింది కాబట్టి, చైతన్యకి కూడా అదే లక్కు తీసుకురావచ్చు.మరోవైపు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.. ఎందుకంటే ఇటీవల వచ్చిన ‘జాక్’ ఫ్లాప్ అవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెరిగింది. చూడాలి మరి నాగ చైతన్య ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటారో లేదో..!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు