Search
Close this search box.

  సినిమాల్లోకి తలా ధోనీ ఎంట్రీ..? నిజమేనా..?

క్రికెట్‌ చరిత్రలో ఎంఎస్ ధోనీకి ప్రత్యేక స్థానం ఉంది.. అద్భుతమైన కెప్టెన్సీ, గుడ్ డెసిషన్స్ తో , పాటు కూల్ కెప్టన్ గా, మరియు అద్భుతమైన వికెట్ కీపర్ గా ధోనికి క్రికెట్ లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది..టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు తెలివివైన నిర్ణయాలు.. ఆయనను అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిపేశాయి. ఇప్పటికీ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అందరినీ ఆశ్చర్పరుస్తుంది..యాడ్స్‌లో తరచూ కనిపించే ఆయన, ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రం కనిపించలేదు. కానీ తాజాగా ధోనీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది..

 

ఈ వీడియోలో ధోనీ ఒక హార్ట్ బెలూన్‌తో రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తాడు. దీంతో ఫ్యాన్స్ “ధోనీ బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమయ్యాడా?” అనే ఉత్కంఠతో కామెంట్లు పెడుతున్నారు. అయితే వీడియో చివర్లో గల్ఫ్ ఆయిల్ కంపెనీకి ట్యాగ్ చేయడంతో, ఇది సినిమా కాకుండా ఓ యాడ్ షూట్ అని అర్థమవుతోంది.

 

ఈ యాడ్‌కు కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అధికారికంగా ఏమీ ప్రకటించలేదు.

 

ధోనీ సినీ రంగ ప్రవేశం చేస్తే అది క్రేజ్‌కు మరో పేరు అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, ప్రస్తుతం ఆయనకు ఉన్న ‘క్లీన్ ఇమేజ్’ ని దృష్టిలో పెట్టుకుంటే సినిమాల్లో పూర్తి స్థాయి పాత్రలు చేయడం అంత సులభం కాదనిపిస్తుంది. అందుకే, ఈ వీడియో ఓ యాడ్‌ భాగమే కావచ్చని భావిస్తున్నారు.. చూడాలి మరి దీని సినీ రంగాల్లోకి ఎంట్రి ఇస్తాడో లేదో

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు