Search
Close this search box.

  ఓజీ నుండి క్రేజీ అప్డేట్..! ఓజీ బ్లాస్ట్ రెడీ..!

పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం ఏపీ లో పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు.. కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ఉంటూ సినిమాలు చేస్తాను ఫాన్స్ కు మాటిచ్చారు.. అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి.. ఈ సినిమా పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి… యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్, ఇప్పటికే విడుదలైన “అంగ్రీ చీతా” సాంగ్‌తో యూత్‌ను ఊపేసింది. ఇక పవన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఇప్పటికే టాక్ వచ్చింది. అయితే, సినిమా నుంచి కొత్త అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు…

 

తాజాగా, సంగీత దర్శకుడు తమన్ ఒక ఈవెంట్‌లో పాల్గొన్న సందర్భంలో పవన్ ఫ్యాన్స్‌కు మంచి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయని, అన్ని పాటల వర్క్ పూర్తైందని ఆయన తెలిపారు. “పవన్ కల్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా సంగీతాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశాం అని కూడా చెప్పారు… ప్రతి పాట ఫ్యాన్స్‌కి ఎగ్జైట్‌మెంట్ ఇస్తుంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ కోసం కూడా ప్లాన్ చేశాం. పవన్ గారు సెట్స్‌కు వచ్చిన రోజే దాన్ని విడుదల చేస్తాం,” అంటూ వెల్లడించారు తమన్.. ప్రస్తుతం ఓజీ షూటింగ్ చివరి దశలో ఉంది. పవన్ కల్యాణ్ ఇప్పటికే ఎక్కువ భాగం షూటింగ్ పూర్తి చేశారు. ఇంకా 20 రోజుల మేర షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం పవన్ గారు లేని సన్నివేశాలను దర్శకుడు సుజీత్ పూర్తి చేస్తున్నారు… అయితే ఈ సినిమాలో ఒక పాటను కోలీవుడ్ స్టార్ శింబు పడబోతున్నట్లు సమాచారం.. గతంలో శింబు చాలా సినిమాల్లో పాటలు పాడారు.. చూడాలి మరి ఓజీ ఫస్ట్ సాంగ్ ఎలా ఉండబోతుందో..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు