లోకేష్ కనగరాజు విక్రమ్ సినిమాతో కోలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు..ప్రస్తుతం లోకేష్, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి కూలీ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో తెలుగు నుండి నాగార్జున, హిందీ నుంచి అమీర్ ఖాన్, కన్నడ నుంచి ఊపేంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాదు, పలు ఇతర భాషల నుండి పాపులర్ నటులు కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నారు. దీంతో ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్‌లో భారీ హైప్ ఉంది.. .ఈ ప్రాజెక్టు తర్వాత లోకేష్ ‘ఖైదీ 2’ సినిమాను ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇక ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. “నా కెరీర్‌లో ఒక్కసారైనా చిరంజీవిగారితో సినిమా చేయాలని కోరిక ఉంది. అది పెద్ద విజయం సాధించాలి” అంటూ మనసులోని మాటను బయటపెట్టాడు.
లోకేష్ స్టైల్ కి చిరంజీవి ఎనర్జీ కలిసివస్తే, అది ఓ మెగా ప్రాజెక్ట్ అవుతుంది. అయితే ఇది నిజంగానే జరగబోతుందాని అందుకనే లోకేష్ ఇంటర్యూలో చెప్పాడని… కొందరు ఫ్యాన్స్ అంటున్నారు.. గతంలో కొన్ని ఇంటర్వ్యూ లో కూడా సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా చేయాలని చెప్పాడు..! ఎట్టకేలకు రజినీ కాంత్ ను ఒప్పించి సినిమా చేస్తున్నాడు.. అలాగే చిరంజీవి తో కూడా సినిమా చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.. చూడాలి మరి ఈ కాంబో ఎప్పుడూ సెట్ అవుతుందో..