Search
Close this search box.

  సమంత మళ్లీ ప్రేమలో పడిందా..? త్వరలో పెళ్లి..? ఫోటోలు వైరల్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఆ తరువాత వారి ఇద్దరి మధ్య ఏవో గొడవల కారణంగా విడిపోయారు.. వాళ్ళు విడిపోవడానికి కారణాలు ఏంటో ఇప్పటికీ కూడా బయటికి ఎవ్వరూ చెప్పలేదు.. కానీ సోషల్ మీడియాలో ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది..

నాగ చైతన్యతో విడాకుల తర్వాత లైఫ్ లో చాలా డిస్టర్బ్ అయింది సమంత.. దాంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి కొన్ని రోజులు ఒంటిరిగా ఉంది.. ఆ తరువాత ఓ వ్యాధి బారిన పడి కోలుకోడానికి చాలా సమయం పట్టింది.. ఆ తరువాత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఈ మధ్య వచ్చిన బాలీవుడ్ వెబ్ సిరీస్ “సిటాడెల్” ఓ కీలక పాత్ర చేసింది సమంత.. విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ కొన్ని మోటివేషనల్ వీడియోస్ చేసింది.. ఆ తరువాత సినిమాల పై ఫోకస్ పెట్టింది.. కానీ సమంత మళ్లీ ప్రేమలో పడిందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ న్యూస్ చాలా రోజుల నుండి వైరల్ అవుతుంది..కానీ ఈ న్యూస్ పై సమంత ఇంత వరకు కూడా స్పందించలేదు..ఈమధ్య బాలీవుడ్ డైరెక్టర్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్టింట దర్శనం ఇచ్చాయి. దాంతో ఈ వార్తలు నిజమేనని అందరు అనుకుంటున్నారు.. ఐతే సమంత ఇంతకు ఎవరి ప్రేమలో పడింది.. ఆ బాలీవుడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా.. సిటాడెల్ సిరీస్ డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నట్లు తెగ వార్తలు వస్తున్నాయి.. ఈ మధ్య జంట రెండు మూడు చోట్ల వీళ్లిద్దరు కలిసి తిరగడం బాలీవుడ్ మీడియా మొత్తం చూసింది.. మరోసారి ఈ జంట ఓ బర్త్ డే పార్టీలో కనబడటంతో ఆ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ తెగ అవుతున్నాయి.. ఈ న్యూస్ నిజమేనని సమంత మళ్లీ ప్రేమలో పడిందని.. రెండో పెళ్లి చేసుకోబోతుందాని నెటిజన్స్ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.. నాగ చైతన్య, శోభితను పెళ్లి చేసుకున్నాడు..త్వరలో సమంత కూడా పెళ్లి చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.. చూడాలి దిని పై సమంత ఎలా స్పందిస్తుందో..ప్రస్తుతం ఇప్పుడు సమంత ‘రక్త బ్రహ్మాండ’ అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషిస్తుంది..

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు