జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు సామర్లకోట పట్టణంలోని కొరియర్ సర్వీసులు, రవాణా ఏజెన్సీలపై పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.కాకినాడ నగరంలో ఒక పార్సిల్ సర్వీస్ గోడౌన్ లో జరిగిన పేలుడు నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు స్థానిక సీఐ కృష్ణ భగవా న్ తెలిపారు.జాగిలాలు, బాంబులను నిర్వీర్యం చేసే విభాగం,స్థానిక పోలీ సు సిబ్బంది పాల్గొని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.కొరియర్ సేవలు, రవాణా సేవలు అందించే కార్యాలయాల్లో దీపావళి బాణాసంచా,పేలుడు పదార్ధాలు, పేలుడు సంభవించే గుణంగల రసాయనాలు, మాదకద్రవ్యాలు వంటి వాటి కోసం సోదాలు నిర్వహిస్తూ, అనుమానాస్పద వస్తువులపై ఆరా తీశారు.ట్రాఫిక్ ఎస్ఐ అడపా గరగారావు,సిబ్బంది పాల్గొన్నారు.
