కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానానికి శనివారం ఒక్కరోజు ఆదాయంగా రూ. 3,36, 158 వచ్చింది. ఆలయ కార్య నిర్వహణ అధికారి వడ్డీ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రత్యేక దర్శనం, అన్న దానానికి, కేశఖండన, తులాభారం, లడ్డూ ప్రసాదం వెరసి వచ్చిన రూ. 3,36,168 గా లెక్కలు తేల్చారు. సుమారు 5వేలమంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు ఆధ్వర్యంలో పూజలు జరిగాయన్నారు.









