పెద్దాపురం మున్సిపాలిటీ పరిధిలో 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈనెల 31వ తేదీలోగా ఇంటి పన్నులు, కొళాయి పన్నులు, రియాల్టీ పన్నులు బకాయిలు చెల్లించాలని, పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ పద్మావతి కోరారు. మార్చి 31వ తేదీ లోగా పన్ను బకాయిదారులంతా పూర్తిస్థాయిలో టాక్స్ చెల్లించాలన్నారు. పన్ను వడ్డీ రాయితీలు ఉండే అవకాశం లేనందున సకాలంలో ప్రజలంతా వారి పనులను చెల్లించాలన్నారు. పెద్దాపురం మున్సిపాలిటీ పరిధిలో అన్ని పన్నుల బకాయిలు వెరసి రూ. 2,17,43,000 ఉన్నట్టు ఆమె చెప్పారు.
