మహిళల అభివృద్ధి, సాధికారత, సమానత్వం కోసం కృషి చేద్దామని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని మార్చి 1 నుండి 7 వరకు జిల్లాలో మహిళా సాధికారిత వారోత్సవాలు నిర్వహిస్తున్నా మన్నారు.విద్యార్ధినులకు మహిళల భద్రత పట్ల, పోలీసు విధుల పట్ల అవగాహన కల్పించేందుకు పరేడ్ గ్రౌండులో ‘ఓపెన్ హౌస్’ ప్రారంభించారు ఎస్పీ.వారోత్సవాల్లో భాగంగా మెడికల్ క్యాంపులు, వ్యాస రచన, వక్తృత్వ, చిత్ర లేఖనం పోటీలను, ఓపెన్ హౌస్, ర్యాలీ నిర్వహిస్తామని ఎస్పీ వెల్లడించారు.
