జనసేన విజయం సాధించిన తర్వాత అందుకు ప్రతీకగా జరిగే సభగా పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభ నిలిచిపోతుందని పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో ఈనెల 14న జరగనున్న నేపథ్యంలో సభా స్థలి వద్ద నాదెండ్ల మనోహర్ భూమి పూజ చేశారు. చిత్రాడ- కాకినాడ రోడ్డులోని ఎస్బీ వెంచర్స్ ప్రాంగణంలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ భూమి పూజ జరిగింది. సుమారు 20 ఎకరాల ప్రాంగణంలో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం విజయం తర్వాత జనసేన విజయానికి గుర్తుగా పార్టీ కార్యకర్తలు, వీరమహిళలు, జనసేన అభిమానులు కలిసి నిర్వహించుకునే కార్యక్రమంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
