ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి మృతదేహాల వెలికితీత పనులను రెస్క్యూ సిబ్బంది ముమ్మరం చేశారు.ఉదయం నుంచి చేపట్టిన రెస్క్యూ కార్యక్రమం లో సిబ్బంది ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. మొత్తం 8 మంది మరణించగా ఇంకా ఐదుగురి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
