ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ స్వేచ్ఛా యుత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేం దుకు సర్వం సిద్ధం చేయడం జరిగిందని అసిస్టెంట్ కలెక్టర్ భావన అన్నారు. తుని పట్టణంలో ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.నియోజకవర్గంలో 3,480మంది ఓటర్లు ఉన్నారు. తుని పట్టణంలో ఐదు పోలింగ్ కేంద్రాలు,కోటనందూరు మండలంలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.తుని పట్టణ,రూరల్ సీఐలు గీతా రామకృష్ణ,చెన్నకేశవ రావు పర్యవేక్షణలో మొబైల్, ప్లేయింగ్ స్కాడ్ ఐదుగురు ఎస్సైలు తో 30 మంది సిబ్బందిని ఈ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
