ఉభయ గోదావరి జిల్లాల పట్టబద్దలు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు (27/02/25) ఉదయం 8 గంటల నుండి 4 గం వరకు జరగనుంది.
■పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ బ్యాలెట్ పేపర్ పద్దతిలో జరుగుతుంది.
■బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థుల పేర్లు,ఫొటో లుఉంటాయి.
■ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ మాత్రమే ఉపయోగించాలి
■ప్రాధాన్యతా క్రమంలో నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగా గల గడిలో 1 అని అంకెను వేయాలి.ఆ తర్వాత ఇష్టమైన వారికి ప్రాధాన్యతను బట్టి 2,3, 4… ఇలా అంకెలు వేయొచ్చు. లేదా వేయకుండా వదిలేయ్యవచ్చు.
■ఒకే అంకెను ఇద్దరికి వేస్తే ఆ ఓటు చెల్లదు.మొదటి ప్రాధాన్యత ఓటు అంటే 1 అంకె వేయకుండా మిగిలిన సంఖ్య లు వేస్తే ఆ ఓటు చెల్లదు.
■1, 2, 3, సంఖ్యలే వేయాలి.రోమన్ అంకెలు వాడరాదు,అంకెలు కాకుండా(√)టిక్,ఇతర గుర్తులు వేస్తే ఓటు చెల్లదు.
■ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సంఘం సూచించిన ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి.