మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా వీరాజీలుతున్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు వేకువజాము నుంచి పోటెత్తారు.సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తొలుత పుష్కరణలో పుణ్య స్థానం ఆచరించి మాతా పితురులకు తర్పణాలు వదిలారు. బ్రాహ్మణులకు స్వయంపాకాలు అందజేశారు.అనంతరం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారిని,అన్నపూర్ణ అమ్మ వారు, పురహుతిక అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులు చేసిన శివనామస్మరణతో మారుమోగింది.పుణ్య స్థానాలు చేసే చోట ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పుష్కరణలో ఎటువంటి సంఘటనలు జరగకుండా నిలువరించేందుకు ఏపీఎస్డిఆర్ఎఫ్ బృందం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
