ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే డిఎస్సీ నిర్వహించి, ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేస్తాం. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఇస్తాం. సాగుకు భరోసా కల్పించేందుకు అన్నదాతకు కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి మూడువిడతల్లో రూ.20 వేలు అందజేస్తాం. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 20 వేలు ఆర్థిక సాయం చేస్తాం. అని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
