కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఉన్న పలు విభాగాలను ఆసు పత్రి సూపరిండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి పరిశీలించి రోగులతో వారికి అందుతున్న సేవలను గురించి ఆరా తీశారు.రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది ప్రవర్తన తీరు,మందులు అన్ని ఇస్తున్నారా,ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా,శానిటేషన్ నిర్వహణ ఎలా ఉంది,రోగులకు పెడుతున్న భోజనము నాణ్యత ఎలా ఉందో అని అడిగి తెలుసుకున్నారు.ఆమె వెంట డాక్టర్ పి శ్రీనివాసన్,డాక్టర్ పి విటల్,గైనిక్ హెచ్ఓడి అనురాగమయి, నర్సింగ్ సూపర్డెంట్ తదితరులు ఉన్నారు.









