ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబందించి మెక్లారిన్ హై స్కూల్ ఏర్పాటుచేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రమైన్నీ కాకినాడ డిఆర్ఒ జె.వెంకటరావు పరిశీలించారు. కాకినాడ డివిజన్ నందు గ్రాడ్యు యేట్ ఎన్నికలకు సంబందించి 67 పోలింగు కేంద్రాలు ఉన్నాయని ఎన్నిక నిర్వహణకు పోలింగ్ సామగ్రి సక్రమంగా చేరే విధంగా కౌంటర్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. డిఆర్ఓ వెంట కాకినాడ ఆర్డిఓ ఎస్. మల్లిబాబు,ఎన్నికల సిబ్బంది తదితరులు ఉన్నారు.









