ఈవీఎం,వీవీపాట్స్ భద్రతకు తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు.మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి రెవిన్యూ,ఎన్నికలు,అగ్నిమాపక,పోలీస్ శాఖల అధికారులతో కలిసి తనిఖీ చేశారు.ఈవీఎం గోదాము భద్రతకు చేపడుతున్న చర్యలను అధికా రులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎం,వీవీపాట్స్ భద్రతకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, ఎన్నికల శాఖల అధికారులను ఆదేశించారు.భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎం గోదామును పరిశీలించి నివేదిక పంపిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట కాకినాడ అర్బన్ తహశీ ల్దార్ వీ.జితేంద్ర,కలెక్టరేట్ ఎన్నికల విభాగం డీటి ఎం.జగన్నాథం ఉన్నారు.









