ఈ నెల 27న జరగనున్న ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ పోలింగ్ రోజున ఓటు వేయడానికి వీలుగా ఓటు హక్కు ఉన్న వారికి తమ ఓటును వినియోగించుకునే వీలుగా ఓటింగ్ రోజు గురువారం స్పెషల్ క్యాజువల్ లీవ్ ను భారత ఎన్నికల సంఘం ప్రకటించిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.అదే విధంగా 27 న ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాలకు,ఏర్పాట్ల నిమిత్తం ముందు రోజు 26వ తేదీ బుధవారం కూడా స్థానిక సెలవుగా ప్రకటించడం జరిగిందని ఆయన తెలిపారు.









