ఆంధ్రప్రదేశ్‌లో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈనేపథ్యంలో ఏపీ నుండి ఎవరికి అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఇందులో ముఖ్యంగా పవన్ సోదరుడు నాగబాబుకు ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ఇక పిఠాపురం నుండి మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్, వంగవీటి రాధా, బీజేపీ నుండి మాధవ్‌కుప్రాధాన్యత ఉంటుందనే ప్రచారం పెరిగింది. ప్రస్తుతం వీరి పేర్లు వినబడుతున్న ప్పటికీ రాజకీయంగా ఎటువంటి మార్పులైనా చోటు చేసుకోవచ్చు.
