సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఛైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ అధ్యక్షతన జరిగింది. కేవలం రెండు అంశాలతో అజెండాను ఏర్పాటు చేయగా దానిపై సరైన చర్చ లేకుండానే కౌన్సిల్ సభ ఆమోదించింది. జీరో అవర్ లో కౌన్సిలర్లు కరణం రాజ్ కుమార్,నేతల హరిబాబులు వార్డుల్లో పలు సమస్యలను కమిషనర్ శ్రీ విద్య దృష్టికి తీసుకెళ్లారు. కౌన్సిలర్లు జట్ల మోహన్, పిట్టా సత్యనారాయణలు ప్రభుత్వ ఆసు పత్రికి వెళ్లే రోడ్డులో బుధవారపు సంతవల్ల రోగుల రాకపోకలకు ఇబ్బందులు పడుతు న్నారన్నారు. నీలమ్మ చెరువు వద్ద గ్రంథాలయం నిర్మించాలని కౌన్సిలర్ కాళ్ల శ్యామల కోరారు.