Search
Close this search box.

  AAA కాంబో..! అట్లీ డైరెక్షన్లో పుష్ప రాజ్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.. సుకుమార్ డైరెక్షన్ లో దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ హైప్ ఉంది. సినిమా రిలీజ్ అయిన తరువాత అదే హైప్ బాక్స్ ఆఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా 1880 కోట్ల రాబట్టి పాత రికార్డులను తుడిచి పెట్టి కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది.. దీంతో అల్లు అర్జున్ క్రేజీ హీరోగా మారిపోయాడు.. ఇప్పుడు అల్లు అర్జున్ చేయబోయే నెక్స్ట్ సినిమా పై అందరి దృష్టి పడింది. పుష్ప లాంటి భారీ సినిమా తరువాత అల్లు అర్జున్ నుండి ఎలాంటి సినిమా రాబోతుంది అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఐతే అల్లు అర్జున్ పుష్ప కు ముందే చాలా సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో త్రివిక్రమ్ తో మైథాలజి మూవీ కూడా ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ఓ సినిమా, కొరటాల శివతో కూడా సినిమాకు అల్లు అర్జున్ కమిట్ అయ్యాడు. దీంతో వీటిలో ఏ సినిమా అల్లు అర్జున్ చేస్తాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఐతే అల్లు అర్జున్ మాత్రం వీళ్ళందరిని పక్కన పెట్టి తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయబోతున్నాడు అంటూ సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అట్లీ,అల్లు అర్జున్ కాంబో సినిమా పై ఎప్పటి నుండి రూమర్స్ వస్తున్నాయి.

కానీ వీటిపై అధికారిక ప్రకటన ఇంత వరకు రాలేదు.. నిజానికి అల్లు అర్జున్ ముందుగా త్రివిక్రమ్ తో మైథాలజీ సినిమా చేయాలి. కానీ స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ సినిమా పెండింగ్ లో ఉంచారట అల్లు అర్జున్.. కొరటాల శివ దేవర2 తొ బిజీ ఉన్నారు. అలాగే సందీప్ స్పిరిట్ తో బిజీ ఉండడం వాళ్ళ అట్లీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అట్లీ ఇటీవలే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తో జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.అప్పటి నుండి అల్లు అర్జున్ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేశారట. స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వడంతో అల్లు అర్జున్ కూడా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా గురుంచి త్వరలోనే అఫిషియల్ ప్రకటన ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ తో అట్లీ ఏ రేంజ్ సినిమా చేస్తాడో చూడాలి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు