వందేళ్ల నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ విద్యాలయ శత వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. 1924లో సామర్లకోట జెడ్పి పాఠశాల నుండి క్రమేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలగా కొనసాగుతున్న విద్యాలయంలో శత వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్వపు విద్యార్థులు పసల పద్మ రాఘ వరావు, దవులూరి సుబ్బారావుల అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో సీనియర్ పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించుకున్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప, వైసీపీ పెద్దాపురం ఇన్ ఛార్జి దవులూరి దొరబాబు పాల్గొన్నారు. దొరబాబు తన తండ్రి దవులూరి సుబ్బారావు పేరిట పాఠశాల అభివృద్ధికి రూ.లక్షవిరాళాన్ని ప్రకటించారు.









