ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్థాన్ పై భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. విరాట్ సూపర్ సెంచరీతో ఆ జట్టుపై 6 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది. పాక్‌ను 241 పరుగులకే కట్టడి చేసిన భారత్,తర్వాత బ్యాటింగ్‌లో 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. రోహిత్ వెంటనే ఔటైనప్పటికీ. సుభమన్ గిల్, విరాట్, శ్రేయస్ విజయాన్ని అందించారు. చివరగా 4 పరుగుల షాట్‌తో విరాట్ మరో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను భారతీయులు బాగా ఎంజాయ్ చేశారు.
