Search
Close this search box.

  గ్రూప్-2 పరీక్షకు 92 శాతం మంది హాజరు

గ్రూప్-2 పరీక్షకు 92 శాతం మంది హాజరు
February 23, 2025 9:56 PM | Aditya369 News

గ్రూప్-2 పరీక్షకు 92 శాతం మంది హాజరు

గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తెలిపింది. ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నార‌ని, 92శాతం మంది హాజరయ్యారని తెలిపారు. గ్రూప్-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం సూచించినా ఏపీపీఎస్సీ మాత్రం యథావిధిగా పరీక్ష నిర్వహించింది. పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసిన వారని, వాయిదా వేస్తే అది శాసనమండలి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు