అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జనసేన పార్టీ సామాన్యుడి గొంతుగా ఉండాలి. ప్రజల సమస్యలను, ఆకాంక్షలను, ఆశలను, సంక్షేమాన్ని, చట్టసభల్లో వినిపించేలా పార్టీ తరఫున ఎన్నికైన ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యులు చర్చల్లో పాల్గొనాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు పవన్ దిశా నిర్దేశం చేశారు. శాసనసభ సంప్రదాయాన్ని, మర్యాదను కాపాడుతూ హుందాగా ముందుకు వెళ్దామని చెప్పారు. బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష నేతలతో ఆయన పలు అంశాలపై చర్చించారు.