సమగ్ర భూ సర్వే కార్యక్రమం పెద్దాపురంలో మండలంలో సమర్దవంతంగా ముందుకు సాగుతుందని తహాశీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మీ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మండలంలోని కట్టమూరు గ్రామాన్ని సమగ్ర భూ సర్వే కు ఫైలట్ ప్రాజెక్టు గా తీసుకుని సర్వే చేస్తుందని తెలిపారు. గ్రామంలో రైతుల భూము లను రీ సర్వే చేసేందుకు ఏడు బృందాలు ఏర్పాటు చేశామని ఇప్పటివరకు 75% సర్వే పూర్తయిందన్నారు.రైతులు సర్వే బృందాలకు ఎలాంటి నగదు చెల్లించవలసిన అవసరం లేదన్నారు.ఇంకా ఈ సర్వే ను చేయించుకోని రైతులంతా త్వరితంగా వ్యవసాయ అధికారులకు, వీఆర్వోలకు భూములకు సంబంధించి పత్రాలు అందించాలన్నారు.
