దేశంలో 2024లో వర్షాలు,ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం తుఫాను కారణంగా ప్రభావితమైన 5 రాష్ట్రాలకు విపత్తులు, వరద సాయం కింద కేంద్రం నిధులను విడుదల చేసింది.ఐదు రాష్ట్రాలకు మొత్తం రూ 1, 554.99 కోట్లు ఇవ్వగా అత్యధికంగా ఏపీకి రూ. 608.08 కోట్లు కేటాయించగా,తెలంగాణకు రూ. 231.75 కోట్లు,నాగాలాండ్‌కు రూ. 170.99 కోట్లు, ఒరిస్సాకు రూ. 255.24 కోట్లు,త్రిపురకు రూ. 288.93 కోట్ల నిధులను ఇచ్చింది.వరదలు, విపత్తుల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు నివేదికలు ఇచ్చాయి. ఆ మేరకు వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.
