ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న ఎపిపిఎస్సి గ్రూపు-2 మెయిన్ వ్రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు.ఈ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర సచి వాలయంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఎ. అనురాధతో కలిసి ఆయన అధికారులతో సమీక్షిం చారు.పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తుతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.13 పాత జిల్లా కేంద్రాల్లోని 175 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే మార్గదర్శకాలను జిల్లాలకు పంపండం జరిగిందని వాటిని పూర్తిగా పాటించాలని స్పష్టం చేశారు.ఈ పరీక్షలకు 92,250 మందిఅభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు.ముఖ్యంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కడైనా ఎవరైనా వదంతులు లేదా నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
