లోకాయుక్త అదేశాలతో ఏడాదికిపైనా విధులకు గైహాజరవుతున్న 55 మంది ప్రభుత్వ వైద్యులను ప్రభుత్వం టర్మీనేట్ చేస్తూ చర్యలు తీసుకున్నట్టు వైద్య,ఆరోగ్య శాఖ లోకాయుక్తకు నివేదిక పంపింది.తొలగింపునకు గురైన వైద్యుల్లో అసోసియేట్ ప్రొఫెసర్లు,అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు.కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతి, సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు గైర్హాజరవుతున్నారని, వైద్యులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.వైద్యులు విధులకు గైర్హాజరవుతున్నట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో లోకాయుక్త ఆదేశాలతో ఏపీలో 55 మంది వైద్యులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది.
