ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గుంటూరు పర్యటనలో భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నేతలు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు పిర్యాదు చేశారు.జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరి స్తోందని వైసీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ కు తెలిపారు.
