పీబీసీ గట్టుపై ఉన్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమం ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహాయంతో చేపట్టారు.ఈ క్రమంలో ఆక్రమ దారులకు,అధికారులమధ్యన తీవ్రవాదోపదాలు జరిగాయి.పిఠాపురం మండలం మాధవపురం గ్రామం సమీపంలో గల పీబీసీ గట్టుపై సుమారు 24సెంట్లు ఆక్రమించి అక్రమదారులు నిర్మాణాలు చేపట్టారు.ఈ క్రమంలో నిర్మాణాలను ఇరిగేషన్ అధికారులు తొలగించారు.ఈ సందర్భంగా పిబిసిఅసిస్టెంట్ ఇంజనీర్ శివకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పిబిసి పంట కాలువ గట్టును ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.









