పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులందరూ ఆత్మవిశ్వాసం సిద్దం కావాలని, సామర్లకోట మండల విద్యా శాఖాధికారి వై.శివ రామకృష్ణయ్య అన్నారు. స్ధానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్ధు లతో ఎంఈవో మాట్లాడారు. ఫ్రీ ఫైనల్ పరీక్షలకు సిద్ధపడిన విధానం పై ఆరా తీశారు. ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయలన్నారు. పది సంవ త్సరాల కష్టానికి ప్రతిఫలంగా టెన్త్ రిజల్ట్స్ ను భావించి, మరింత శ్రద్ధ గా చదువుకోవాలన్నారు.
