ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు హాజరై పుణ్యస్నానమాచరించారు. భార్య అన్నాలెజినోవా, కుమార్ అఖీరాతో కలిసి త్రివేణి సంగమంలో పూజలు చేసి, హారతులిచ్చారు. మహాకుంభమేళాకు రావడం ఆనందంగా ఉందని పవన్ అన్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేసిందన్నారు. దర్శకులు తివిక్రమ్ శ్రీనివాస్, ఆనంద్ సాయి పవన్ వెంట ఉన్నారు.
