కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షకుల కోసం అమలు చేస్తున్న “ఈ శ్రమం” ఉచిత బీమా పథకాన్ని కార్మికులు, కర్షకులు సద్వినియోగం చేసుకో వాలని జిల్లా లేబర్ అధికారి రవిశంకర్ కుమార్ పిలుపునిచ్చారు. వాక్ విత్ క్రైస్ట్ చర్చ్ పాస్టర్ డాక్టర్ పి.ఆనంద్ ఆధ్వర్యంలో సామర్లకోట బ్రౌన్ పేట వద్ద ఉన్న అంబేద్కర్ కాలానీలో బీమా నమోదు శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరం బుధవారం కూడా కొనసాగుతుందన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉండి 60 సంవత్సరాల లోపు వారు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
