Search
Close this search box.

  తెలుకులు, గాండ్ల కుల‌స్తుల కోసం తేలి చిత్రం

తెలుకులు, గాండ్ల కుల‌స్తుల కోసం తేలి చిత్రం

తెలుకుల, గాండ్ల కులస్తులు తయారు అనాదిగా చేస్తున్న నూనె తయారీ పై తేలి అని పేరుతో ప్రత్యేక చిత్రం త్వరలోనే రూపొందించనున్నట్లు ప్రముఖ సినీ నటుడు, సీరియల్ నటుడు మొల్లేటి బాలాజీ వెల్లడించారు. సామర్లకోట పంచారామ క్షేత్రం భీమేశ్వరాలయాన్ని ద‌ర్శించుకున్న అనంత‌రం మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. 1983 వ సంవత్సరంలో తాను “ఓ ఆడది మగాడు” చిత్రం ద్వారా దర్శకులు దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో చిత్ర సీమలోకి అడుగు పెట్టానని, తదుపరి “మగమహారాజు”,”మంగమ్మగారి మనవడు” వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొంది, సినీ నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అప్పటినుండి తాను పొందుతున్నట్లు చెప్పారు.

నూనె తయారీ పై అసలు విషయాలను వెలుగులోకి తెస్తూ సినిమాను రూపొందిస్తున్నట్లు చెప్పారు. నూనె పుట్టుక, వినియోగం, అన్ని వంటకాల్లో పూజల్లో నూనెకు అంతటి ప్రాధాన్యత దక్కడం వంటి అంశాలపై చిత్రంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించనున్నట్లు చెప్పారు. త్వరలో “త్రినేత్ర” సినిమాలో కూడా తాను నటిస్తున్నట్లు చెప్పారు.

మనిషి జీవితం 3 తో ఆధారపడి ఉందని మూడు కాలాలు, మూడు ముళ్ళు, స్థితి, గతి వికాసం వంటి మూడు నేత్రాలతో కూడిన మానవుని జీవన ప్రయాణం పై “త్రినేత్ర” పేరుతో చిత్రం రూపొందుతుంద న్నారు. ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ తో బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో తాను నటిస్తున్నట్లు చెప్పారు. వశిష్ట చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా, మరో చిత్రంలో ఫుట్‌బాల్ కోచ్ గా నటిస్తున్నట్లు చెప్పారు. సినీ ప్రయాణం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.

40 ఏళ్ల తన సినీ జీవితంలో ఇప్పటివరకు రెండుసార్లు భీమేశ్వర ఆలయానికి రావడం జరిగిందన్నారు.సామర్లకోటలో 100 సంవత్సరాలు పైబడి అంబటి సుబ్బన్న కంపెనీ నూనె పరిశ్రమలో అందిస్తున్న సేవలను సినీ నటుడు బాలాజీ కొనియాడారు. కూచిపూడి నృత్యకారుడు ప్రసాద్ ను అభినందించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు