రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,392 పోలీస్ స్టేషన్లు ఉంటే, కేవలం 1,001 స్టేషన్లలోనే సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని పీఎస్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. జైళ్లలో, పోలీస్ స్టేషన్లలలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
