అయోధ్య బాల రామయ్య ఆలయానికి భారీగా ఆదాయం సమ కూరుతోంది. వార్షిక ఆదాయం పరంగా దేశంలోనే మూడో పెద్ద ఆలయంగా రికార్డు సాధించింది.రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన నాటి నుంచి 13 కోట్ల మందికిపైగా భక్తులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ ఆలయ వార్షిక ఆదాయం రూ.700 కోట్లు దాటింది. వార్షిక ఆదాయం పరంగా రామ మందిరం స్వర్ణ దేవాలయం, శ్రీమాతా వైష్ణోదేవి, షిర్డీసాయిబాబా ఆలయాల ఆదాయాన్ని దాటింది.
