కాకినాడ జిల్లా తుని మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారిన నేపథ్యంలో కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న తుని మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దౌర్జన్యం కేసు నమోదైంది. కౌన్సిలర్లకు స్వేచ్ఛ లేకుండా ఎన్నికల్లో పాల్గొనివ్వకుండా చేస్తున్నా రని, అడిగిన వారిపై దౌర్జన్యం చేశారన్న తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తునిలో జరుగుతున్న రగడ నేపథ్యంలో వైస్ ఛైర్మన్ ఎన్నికను మంగళవారానికి అధికారులు వాయిదా వేశారు.
