కాకినాడ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే పిఠాపురంలోని కుక్కుటేశ్వరస్వామి ఉత్సవాలపై ఈనెల 19న జిల్లా కలెక్టర్ పలుశాఖల అధికారులతో షణ్మోహన్ సమీక్ష నిర్వహించనున్నారు. భక్తుల తాకిడి, పోలీసు బందోబస్తు, వైద్యసదుపాయం, భక్తులకు సౌకర్యాలు తదితర అంశాలపై అన్ని శాఖల అధికారులతో ఆయన పాదగయ క్షేత్రంలోనే సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
