డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం ప్రభుత్వ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. ఇంటినుండి స్కూలుకు బయలు దేరిన బాలిక. స్కూలుకు చేరుకోకపోవడంతో తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారమిచ్చారు.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలికను గుర్తించి తండ్రికి అప్పగించారు. చంటి అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
