ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మత్స్యకారులకు నష్టపరిహారం, సిఎస్ఆర్ నిధులు సక్రమంగా విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కాకినాడ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, కాకినాడ సిటీ, రూరల్, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు కొండబాబు, పంతం నానాజీ, దాట్ల బుచ్చిరాజు జిల్లా కలెక్టర్ ను కలిసి మత్స్యకార సమస్యలు తెలిపారు.
