ఈనెల 26న మహాకుంభమేళా ముగియనుంది.భక్తుల సౌకర్యార్థం ఉత్తర రైల్వే ఫిబ్రవరి15-17 వరకు న్యూ ఢిల్లీ,వారణాసి మధ్య ప్రయాగ్రాజ్ కు వందే భారత్ ప్రత్యేక రైలును నడపనుంది.
ప్రత్యేక రైలు నంబర్ 02252 న్యూఢిల్లీ నుండి ఉదయం 5.30 గం బయలుదేరి ప్రయాగ్రాజ్ కు మధ్యా హ్నం 12.00గం అక్కడినుంచి వారణాసి కి 2.20 గంటలకు చేరుకుంటుం దని ఉత్తర రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది.
తిరిగి వెళ్ళే రైలు నంబర్ 02251 వారణాసి నుండి 3:15గం ప్రయాగ్రాజ్ 4:20గం బయలుదేరి అదే రోజు 23:50గం న్యూఢిల్లీ చేరుకుంటుందని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు.