తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికారులు కాకినాడ జిల్లాలో 70,540 మంది ఓటర్లకు 21 మండలాల్లో 98 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.పోలింగ్ ప్రక్రియ ఈ నెల 27న గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుందన్నారు.
పీవోలు123మంది,ఏపీవోలు123 మంది,21మంది సెక్టార్ అధికారులను నియమించడం జరిగింద న్నారు.పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూముకి సురక్షితంగా తరలించేంత వరకు అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు.
