ఈ నెల 27 న జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో,సమర్థవంతంగా నిర్వహించాలని తూర్పు- పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవ ర్గ ఏఆర్వో జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు.
తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మంది రంలో పీవో,ఏపీవో,సెక్టార్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్వో జె.వెంకటరావు,కాకినాడ ఆర్డీవో ఎస్ మల్లిబాబు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో విధులు- పోలింగ్ ప్రక్రియ,పోలిం గ్ మెటీరియల్,డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, పీవో డైరీ,టెండర్ ఓటు, సీక్రెస్సీ ఆఫ్ ఓటు, బ్యాలెట్ పేపర్ ఎకౌంటు,పోలింగ్ ఎజేంట్లు,మైక్రో అబ్జర్వర్ల విధులు, పోలింగ్ కేంద్రాలు,ఫర్నిచర్,విద్యుత్, పోలింగ్ రోజున అనుసరించాల్సిన విధానలపై పోలింగ్ సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని,బ్యాలెట్ పత్రం బ్యాలెట్ బాక్సుల విధానంలో పోలింగ్ జరుగుతుందన్నారు.ఈ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలింగ్ సిబ్బంది కృషి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇతర సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.