డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి కళ్యాణ ఉత్సవాలలో భాగంగా స్వామివారి పుష్పక వాహనంపై గ్రామోత్సవం ఘనంగా జరిగింది. గోవింద నామంతో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అంగరంగ వైభవోపేతంగా అలంకరణ, కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా కాల్పులు తో ఉత్సవాన్ని జరిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్, అర్డిఓలు కే. మాధవి, అఖిల లు పాల్గొన్నారు. స్వామివారి తెప్పోత్సవంలో హంస వాహనానికి దాతలు గొట్టుముక్కల భీమరాజు దంపతుల సహకారంతో అలంకరణ చేశారు. భక్తులకు భారీగా అన్నదానం చేశారు. స్వామి అమ్మవార్లకు శ్రీ పుష్పోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ స్థాపకులు , అనువంశ ధర్మకర్త రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహుదూర్, ఉత్సవ కమిటీ చైర్మన్ డి.బాలాజీ, అసిస్టెంట్ కమిషనర్ వి. సత్యనారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ రామలింగే శ్వరరావు, సూపరింటెండెంట్ విజయ సారధి, సత్య కిరణ్ ప్రసాద్, డిఎస్పీ మురళీ మోహన్, తదితరులు పాల్గొన్నారు.