పంజాబ్‌లోని లూథియానా జిల్లాలోని జాగ్రావ్ పశువుల మార్కెట్‌లో జరుగుతున్న 18వ అంతర్జాతీయ పీడీఎఫ్‌ఏ డైరీ అండ్ అగ్రి ఎక్స్‌పోలో ఈ అద్భుతం జరిగింది.ఒక ఆవు 24 గంటల్లో 82 లీటర్ల పాలు ఇచ్చి దేశంలో గతంలో ఉన్న రికార్డులను మొత్తం కొల్లగొట్టింది.మోగాలోని నూర్‌పూర్ హకీమా గ్రామంలోని ఓంకార్ డెయిరీ ఫామ్‌కు చెందిన హెచ్‌ఎఫ్ జాతి ఆవు 24 గంటల్లోనే 82 లీటర్ల పాలు ఇచ్చి నేషనల్ రికార్డును సృష్టించింది. పటియాలాలోని పలియా ఖుర్ద్ గ్రామానికి చెందిన అగర్‌దీప్ సింగ్‌కు చెందిన ఆవు 78.570 లీటర్ల పాలు ఇచ్చి రెండో స్థానంలో లుథియానాలోని కులార్ గ్రామానికి చెందిన సంధు డైరీ ఫామ్‌కు చెందిన ఆవు 75.690 లీటర్ల పాలు ఇచ్చి మూడో స్థానంలో నిలిచాయి.
